Hyderabad Formula E prix : హైదరాబాద్ ఈ ప్రీ (Hyderabad E Prix) సూపర్ సక్సెస్. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ ప్రీ రేసింగ్ ప్రియులను అలరించింది. ఆఖరి ల్యాప్ వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ రేసులో సూపర్ డ్రెవింగ్ తో మెరిసిన డీఎస్ పెన్ స్కీ (DS PENSKE) డ్రైవర్ జనరిక్ వర్న్ (jean eric vergne) విజేతగా నిలిచాడు. 2023లో జనరిక్ వర్న్ కు ఇది తొలి విజయం కాగా.. ఓవరాల్ గా 11వది. రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన జనరిక్ వర్న్ 32 ల్యాప్ ల రేసును అందరికంటే ముందుగా ముగించి విజేతగా నిలిచాడు. నిక్ కేస్ డీ రెండో స్థానంలో నిలిచాడు. సెబాస్టియన్ బుమీ మూడో స్థానంలో నిలిచాడు. అయితే పెనాల్టీ కారణంగా అతడు 15వ స్థానాానికి పడిపోయాడు. దాంతో నాలుగో స్థానంలో నిలిచిన కోస్టాకు మూడో స్థానం దక్కింది. ఇక మహీంద్రా రేసింగ్ కు చెందిన ఒలివర్ రొలాండ్ 6వ స్థానంలో నిలిచాడు. మరో డ్రైవర్ లుకాస్ డి గ్రాసి 14వ స్థానంలో నిలిచాడు.
32 ల్యాప్ ల ప్రధాన రేసును ఎవాన్స్ పోల్ పొజిషన్ నుంచి ఆరంభించాడు. అయితే 13వ ల్యాప్ లో సహచరుడు స్యామ్ బర్డ్ ఎవాన్స్ కారును ఢీ కొట్టాడు. దాంతో ఎవన్సా, బర్డ్ ఇద్దరు రేసు నుంచి వైదొలిగారు. ఇక ఇక్కడి నుంచి లీడ్ లోకి వచ్చిన జనరిక్ వర్న్ సూపర్ డ్రైవింగ్ తో దూసుకెళ్లాడు. అయితే డెనిస్, సెబాస్టియన్ బుమీ, క్యాస్ డీ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా డెనిస్ దూకుడుగా కారును నడుపుతూ ఏ క్షణంలో అయినా జనరిక్ వర్న్ కారును అధిగమించేలా కనిపించాడు. అయితే 26వ ల్యాప్ లో రాస్ట్ మలుపు దగ్గర కారును అదుపుచేయడంలో విఫలమై.. డెనిస్ కారును వెనుక భాగంలో డీకొట్టాడు. దాంతో వీరిద్దరు కూడా రేసు నుంచి వైదొలిగాడు.