Amigos Review: మూవీ రివ్యూ: అమిగోస్

2022లో “బింబిసార” సర్ప్రైజ్ హిట్. టైం ట్రావెల్ కాన్సెప్టుతో చాలా కొత్తగా ఉండి ప్రేక్షకుల మెప్పు పొందింది. అదే విధంగా ఈసారి “డొప్పెల్ గేంగర్స్” కాన్సెప్టుతో వచ్చిన ఈ “అమిగోస్” ట్రైలర్ విడుదలైనప్పటినుంచి కొన్ని అంచనాలు ఏర్పరిచింది.

 

 

వినడానికి “డొపెల్ గేంగర్స్” అనేది కొందరికి కొత్తపదంలా కనిపిస్తున్నా “లుక్ అలైక్” కి ఇది మరో పేరంతే. గతంలో ఈ లుక్ అలైక్స్ కథలు అనేకం చూసాం తెలుగు తెరమీద. ఎన్.టి.ఆర్ “రాముడు భీముడు”, చిరంజీవి “ముగ్గురు మొనగాళ్లు”, నాగార్జున “హల్లో బ్రదర్” ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అయితే వాటిల్లో కామన్ పాయింట్ ఆ లుక్ అలైక్స్ అన్నదమ్ములవడం. కానీ ఈ డొపెల్ గేంగర్స్ అలా కాదు. వీళ్ళ మధ్య ఎటువంటి బంధుత్వాలూ ఉండవు..కానీ ఒకేలా ఉంటారు. అదొక్కటే తేడా. ఈ తరహా పాయింట్ కొత్తదా అంటే అదీ కాదు. కమల్ హాసన్ “ఇంద్రుడు చంద్రుడు” ఎప్పుడో చూసాం. అందులో పాత్రలిద్దరూ కేవలం లుక్ అలైక్స్ అంతే..బంధుత్వమేదీ ఉండదు. కనుక సౌండింగ్ కొత్తగా ఉండడం, ఎన్నో ఏళ్ల నుంచి డొపెల్ గేంగర్స్ వెబ్సైట్స్ కూడా ఉండడం..వాటి బ్యాక్ గ్రౌండ్లో సినిమా కావడం వల్ల ఇదేదో కొత్త ప్రయోగంలా అనిపిస్తుందంతే.

 

కథలోకి వెళ్తే ఇషికా అనే అమ్మాయిని సిద్ధార్థ్ ప్రేమిస్తాడు. కానీ అనుకోని విధంగా సిద్ధార్థ్ ఒక వెబ్సైట్ ద్వారా తనలాగే పోలిన మరొక ఇద్దర్ని కలుస్తాడు. ఒకడు కలకత్తాకి చెందిన మైకేల్, మరొకడు బెంగళూరుకు చెందిన మంజునాథ హెగ్డే. వీరిలో ఒకడు పెద్ద క్రిమినల్. అతను సిద్ధార్థ్ ని ఎలా వాడుకోవాలనుకుంటాడు, దానిని హీరోగా సిద్ధార్థ్ ఎలా తిప్పికొడతాడు, మధ్యలో మంజునాథ్ ఎలా నలుగుతాడు అనేదే కథంతా.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »