‘అటెండెన్స్ రిజిస్టర్‌లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్ రూమ్‌లో ఉంటాడు. ఛాలెంజ్ చేసి చెబుతున్నా’ అంటున్నారు ధనుష్. (Dhanush) ఆయన కీలక పాత్రలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సార్’ (SIR). సంయుక్త మేనన్ కథానాయిక. బుధవారం ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తూ సందేశాత్మకంగా ‘సార్’ను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.. ఫిబ్రవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.