‘మజిలీ’ ‘ప్రతిరోజూ పండగే’ వంటి పలు హిట్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ‘కలర్ ఫోటో’ తో హీరోగా కూడా ఎస్టాబ్లిష్ అయ్యాడు సుహాస్. మొన్నామధ్య వచ్చిన ‘హిట్ 2’ లో సైకో విలన్ గా కూడా చేసి కంప్లీట్ యాక్టర్ అనే బిరుదుకి కొంచెం దూరంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో సుహాస్ హీరోగా నటించిన మరో చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. టీజర్, ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ తో ఈ మూవీ పై జనాల్లో కొద్దిపాటి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
దర్శకుడు షణ్ముక్ ప్రశాంత్ తాను అనుకున్న పాయింట్ కు మంచి కథనాన్ని అల్లుకున్నాడు.కామెడీ ట్రాక్ లు బాగా రాసుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలను కూడా అతను బాగా డీల్ చేశాడు. ఆ రకంగా ఇతను పాస్ మార్కులు వేయించుకున్నాడు అని చెప్పాలి. పాటలు కూడా బాగున్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. నిర్మాణ విలువలు భారీ స్థాయిలో ఏమీ లేవు. కథకు, కథనానికి తగ్గట్టు యావరేజ్ గా ఉన్నాయి.
ప్రొడక్షన్ డిజైన్ కూడా అంతే..! ఎడిటింగ్ పరంగా అక్కడక్కడా కొన్ని అనవసరమైన సన్నివేశాలు ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో అనవసరమైన సన్నివేశాలు ఉన్నాయనిపిస్తుంది.