బాల మేధావికి ప్రధాని సహా ప్రముఖుల అభినందనల వెల్లువ

చిన్నవయస్సులోనే ఆండ్రాయిడ్   అనే పుస్తకాన్ని రాసిన బెంగళూరు నగరానికి చెందిన బాలుడు రిషి శివప్రసన్న(8)కు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కారం దక్కింది. కేంద్ర మానవ వనరులశాఖ దేశంలోని అసాధారణ ప్రతిభావంతులైన పలువురు బాలలను గుర్తించింది. వీరికి సోమవారం రాత్రి దిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలు ప్రదానం చేశారు. మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు పొందారు. రిషి సాధనలు అపూర్వమని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై హర్షం వ్యక్తం చేశారు. చిన్నారి ఐక్యూ- 180 ఉన్నట్లు విద్యావేత్తలు ప్రకటించారు. బాలుడి తండ్రి శివప్రసన్నకుమార్,  బెంగళూరులో ప్రైవేటు అధ్యాపకుడు. తల్లి ఐటీ ఇంజినీరు. బాలుడి ప్రతిభను గుర్తించిన మైసూరు సుత్తూరు మఠాధిపతి దేశీకేంద్ర స్వామి, ఇన్ఫోసిస్  ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ సుధామూర్తి తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా రిషి మాట్లాడుతూ బాగా చదివి, క్యాన్సర్   కు మందు కనిపెడతానంటున్నారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »